వినుకొండ ముచ్చట్లు:
సోంత శాఖ సిబ్బంది అని నిర్లక్ష్యమా…???… లేక … నిజంగానే మల్లయ్య ను పట్టుకోలేక పోతున్నారా…??
తన పై సిఐ చిన్న మల్లయ్య బలవంతంగా బలత్కారం చేసాడని ధనలక్ష్మి అనే మహిళ ఫిర్యాదు చేసి 12 రోజు లైనా మల్లయ్య ను అరెస్టు చేయలేని పోలిసులు…!!!,
వినుకొండమండలం బ్రాహ్మణపల్లి లో పోలిస్ కోచింగ్ సెంటర్ నిర్వహణ పేరుతో సిఐ చిన్న మల్లయ్య ఎకరం స్ధలం లో, పది గదులు నిర్మించాడని సమాచారం అక్కడ ఒక గదిలో గత నెల 29 న సిఐ చిన్న మల్లయ్య తనపై బలవంతంగా బలత్కారం చేసాడని ధనలక్ష్మి అనే మహిళ పోలిసులకు ఫిర్యాదు చేసిన సంఘటన తెలిసిందే.
ఈ సంఘటన పై పోలీసులు అదే రోజు కేసు నమోదు చేసి మహిళ ను వైద్య పరీక్షలు నిమిత్తం ఆసుపత్రికి తరలించారు అనంతరం స్టేట్మెంట్ నమోదు నిమిత్తం న్యాయమూర్తి ముందు హజరు పరిచిన సంగతి తెలిసిందే.
ఈ సంఘటన జరిగినప్పుడు నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న సిఐ చిన్న మల్లయ్య ఆజ్ఞాతం లోకి వెళ్లినట్లు సమాచారం.
సిఐ చిన్న మల్లయ్య కోసం పోలీసులు పలు బృందాలుగా ఏర్పడి 12 రోజులుగా అన్వేషిస్తున్నా మల్లయ్య అచూకీ మాత్రం లభ్యం కాలేదని సమాచారం.
పలువురు మహిళలతో సిఐ చిన్న మల్లయ్య.
Tags: Will the police be able to trace CI Chinna Mallayya’s whereabouts?