శ్రీకాకుళం ముచ్చట్లు:
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఉగాది పురస్కారాల్లో జిల్లాకు చెందిన ముగ్గురు కళాకారులకు చోటు దక్కింది. నాటక రంగంలో పిరియా చలపతిరావు, అర్జంగి లింగమూర్తి, చెంచు నృత్య కళకు ఆవల జగన్నాథం ఈ అవార్డులకు ఎంపికయ్యారు. కవిటి మండలం బి.గొనపపుట్టుగ గ్రామానికి చెందిన పిరియా చలపతిరావు నాటక రంగంలో కళారత్న అవార్డును అందుకున్నారు. ఆయన 1996లో శార్వాణి ఫైనార్ట్స్ సంస్థ ద్వారా తన ప్రస్థానాన్ని ప్రారంభించి, అనేక రాష్ట్ర, అంతర్రాష్ట్ర స్థాయి అవార్డులు, నంది పురస్కారాలు అందుకున్నారు. తాజాగా కళారత్న రాష్ట్రస్థాయి అవార్డుకు ఎంపిక కావడంతో ఉద్దానం ప్రాంత కళాకారులు, అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Tags: Three Ugadi Awards for Artists from Srikakulam District