తెలంగాణ ముచ్చట్లు:
బోనాల ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్, సైబరాబాద్, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ల పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం మద్యం అమ్మకాలపై పోలీసులు ఆంక్షలు విధించారు. ఆగస్టు 9 ఉదయం 10 గంటల నుంచి.. ఆగస్టు 11 ఉదయం 10 గంటల వరకు 48 గంటల పాటు చార్మినార్ జోన్‌లో వైన్ షాపులు, బార్లు మూతపడనున్నాయి. రాజేంద్రనగర్, గోల్కొండ జోన్లలో 24 గంటలపాటు మద్యం దుకాణాలు మూసి ఉంటాయి. అయితే, స్టార్ హోటళ్లకు ఈ ఆంక్షల నుంచి మినహాయింపు కల్పించారు.
Tags: Bonalu Festival: Liquor shops to remain closed for two days.