May 9, 2026
Explore
రెండవ రోజు వైభవంగా సాగిన సయ్యద్‌ నూర్‌షావలి బాబా ఉరుసు

రెండవ రోజు వైభవంగా సాగిన సయ్యద్‌ నూర్‌షావలి బాబా ఉరుసు

May 9, 2026 | Uncategorized

  • ఖవ్వాలి పాటల హోరు

పుంగనూరుముచ్చట్లు:

పట్టణంలోని చెరువు కట్టపై గల సయ్యద్‌ నూర్‌షావలి బాబా దర్గా వారి ఉరుసు మహోత్స వాన్ని ముస్లింలు శనివారం రాత్రి రెండవ రోజు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దర్గాలో చాదర్‌, పూల దండలు వేసి ముస్లిం పెద్దలు ప్రార్థనలు నిర్వహించారు. దర్గాను విద్యుత్‌ దీపాలతో సుందరంగా అలంకరించారు. ఖవ్వాలి పాటలను నాగపూర్‌కు చెందిన ఇంతియాజ్‌సాబిరి, ముంబైకి చెందిన అంజాబ్‌సాబిరి , పూనేకు చెందిన తౌసిఫ్‌జునైది , కర్నాటకాకు చెందిన తౌసిఫ్‌ఖాదరి లచే వేకువజాము వరకు నిర్వహించారు. ఖవ్వాలి పాటల పోటీలు ప్రజలను ఉర్రుతలూగించింది. ఉరుసు సందర్భంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండ మదనపల్లె డిఎస్పీ పావని ఆధ్వర్యంలో సీఐ సుబ్బరాయుడు, ఎస్‌ఐలు అన్సర్‌బాషా, రమణ, పోలీసులు బందో బస్తు నిర్వహించారు. ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలగకుండ ఎప్పటికప్పుడు క్రమబద్దీకరించారు.

Tags; Syed Noor Shah Wali Baba’s Urs Celebrated Grandly on the Second Day