అమరావతిముచ్చట్లు:
శనివారం ఒక అద్భుత ఖగోళ వింత ఆవిష్కృతం అయ్యింది. మధ్యాహ్నం 12:12 గంటలకు సూర్యుడు సరిగ్గా నడినెత్తి మీదకు రానుండటంతో, వస్తువుల నీడలు కనిపించకుండా పోయే ‘జీరో షాడో డే’ ఏర్పడింది. సూర్య కిరణాలు నిలువుగా (90 డిగ్రీల కోణంలో) పడటం వల్ల నీడలు వస్తువుల కిందకే చేరిపోతాయి. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ పరిభ్రమించే క్రమంలో ఏడాదికి రెండుసార్లు ఇలాంటి అరుదైన దృశ్యం కనిపిస్తుంది.
Tags;The Shadow That Vanished Today!!!