May 9, 2026
Explore
బాలికలకు టైలరింగ్‌లో శిక్షణ

బాలికలకు టైలరింగ్‌లో శిక్షణ

May 9, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

మండలంలోని ఇటుకనెల్లూరు గ్రామంలో ఉన్న అంబేద్కర్‌ జ్ఞానభవన్‌లో శనివారం బాలికలకు టైలరింగ్‌లో శిక్షణ ప్రారంభించారు. పరివర్తనసేవా సంస్థ అధ్యక్షుడు శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. వేసవి సెలవుల్లో బాలికలకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సభ్యులు చిన్నరెడ్డెప్ప, జ్ఞానేంద్ర, వేణు, వెంకటేశు తదితరులు పాల్గొన్నారు.

Tags; Tailoring Training for Girls