October 31, 2026
Explore
నాయుడుపేటలో పోలింగ్ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

నాయుడుపేటలో పోలింగ్ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

October 31, 2026 | Andhra Pradesh

– స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రం భద్రతా ఏర్పాట్లపై సమీక్ష.

  • పోలింగ్ కేంద్రంలో భద్రతా ఏర్పాట్లు, విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బంది అప్రమత్తతను పరిశీలించిన జిల్లా ఎస్పీ.
  • ఎన్నికల విధుల్లో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా నిష్పక్షపాతంగా, సమన్వయంతో విధులు నిర్వహించాలని సిబ్బందికి ఆదేశాలు.
  • స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించి పటిష్ట భద్రత, నిరంతర నిఘా, ముందస్తు జాగ్రత్తలపై అధికారులకు సూచనలు.
  • ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్రతి దశలోనూ అప్రమత్తంగా ఉంటూ, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశం.

తిరుపతిముచ్చట్లు:

తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, నాయుడుపేటలోని పోలింగ్ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి, అక్కడ చేపట్టిన భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బందికి ఎన్నికల నియమ నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తూ, అప్రమత్తతతో విధులు నిర్వహించాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

అనంతరం స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించి భద్రతా ఏర్పాట్లు, నిరంతర పర్యవేక్షణ, సీసీటీవీ నిఘా, ప్రవేశ నియంత్రణ తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు. స్ట్రాంగ్ రూమ్ భద్రత విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని, కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా అవసరమైన అన్ని ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో నాయుడుపేట పోలింగ్ ఇన్‌చార్జ్, అదనపు ఎస్పీ (అడ్మిన్) శ్రీనివాసులు, నాయుడుపేట డిఎస్పీ చెంచుబాబు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Tags:District SP conducts surprise inspection of a polling station in Naidupeta