గుంటూరు ముచ్చట్లు:
కొన్ని నెలలుగా సహజీవనం చేస్తున్న నిజాంపట్నం మండల వ్యవసాయ అధికారి చుక్కా విజయరాజుతో పెళ్లి చేయాలని ఆ విభాగ పొరుగుసేవల ఉద్యోగిని డిమాండ్ చేశారు.
ఆయన నిరాకరించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశానని, వారు పట్టించుకోకపోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు బాధితురాలు తెలిపారు.
విజయరాజు గతంలో తనను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడని..,
నగ్న చిత్రాలు తన భర్తకు పంపించి కుటుంబంలో కలతలు సృష్టించాడని ఆమె ఆరోపించారు.
భర్తని దూరంగా పెట్టిన తనను విజయరాజు చర్చిలో రహస్యంగా పెళ్లి చేసుకున్నాడని..,
అధికారికంగా పెళ్లి చేసుకోవాలని కోరుతున్న తనను దూరంగా పెడుతున్నట్లు ఆమె తెలిపారు.
నిజాంపట్నం జడ్పీటీసీ సభ్యులు ఒకరు, విజయకుమార్ ఇచ్చిన నగదు తీసుకుని పెళ్లి గురించి మరిచిపోవాలని తనతో చెప్పినట్లు ఆమె ఆరోపించారు.
దీనిపై రేపల్లె డీఎస్పీ, జడ్పీటీసీ సభ్యులు విజయకుమార్ తో పెళ్లి చేయడం కుదరదని చెప్పి పంపించామని తెలిపారు.
విజయరాజును సంప్రదించేందుకు ప్రయత్నించగా, అందుబాటులోకి రాలేదు.
Tags; Live-in relationship… followed by marriage… eventually, a dispute at the police station… and in the end?