May 9, 2026
Explore
టిడిపి సభ్యత్వ బీమా కింద రూ.5 లక్షల చెక్కు అందజేత

టిడిపి సభ్యత్వ బీమా కింద రూ.5 లక్షల చెక్కు అందజేత

May 9, 2026 | Andhra Pradesh

గుర్రంకొండ ముచ్చట్లు:

గుర్రంకొండ మండలం మర్రిపాడు గ్రామానికి చెందిన గంగరాజు ప్రమాదవశాత్తు మరణించిన నేపథ్యంలో, ఆయన కుటుంబానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ విభాగం ద్వారా ప్రమాద బీమా కింద రూ.5 లక్షలు మంజూరయ్యాయి. ఈ మేరకు మంజూరు పత్రాన్ని గంగరాజు భార్య నాగమణికి పీలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని వారు తెలిపారు.

Tags: Presentation of a ₹5 Lakh Cheque under the TDP Membership Insurance Scheme