రాజంపేట ముచ్చట్లు:
రాజంపేట మండలం హెచ్. కొత్తపల్లి గ్రామానికి చెందిన మన్నూరు సొసైటీ మాజీ అధ్యక్షులు, క్రషర్ యజమాని చొప్పా వెంకటరెడ్డి వైసీపీని వీడి బీజేపీలో చేరారు. ఆయనతో పాటు ఆయన సోదరుడు లక్ష్మీకర్ రెడ్డి, అనుచరులు కూడా బీజేపీలో చేరారు. శుక్రవారం విజయవాడలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి సమక్షంలో వీరు పార్టీలో చేరారు. వెంకటరెడ్డి చేరికతో రాజంపేట ప్రాంతంలో బీజేపీ బలం పెరుగుతుందని నేతలు పేర్కొన్నారు.
Tags: YCP Leader Choppa Venkata Reddy Joins BJP