May 9, 2026
Explore
భార్య మీద కోపంతో అర్థరాత్రి అత్త ఇంట్లోకి దూరి..మొత్తం దోచేసాడు…!

భార్య మీద కోపంతో అర్థరాత్రి అత్త ఇంట్లోకి దూరి..మొత్తం దోచేసాడు…!

May 9, 2026 | Andhra Pradesh

గుంటూరు ముచ్చట్లు:

చేబ్రోలు మండలం గుండవరానికి చెందిన గోపికి.. వేజెండ్ల గ్రామానికి చెందిన తిరుపతమ్మకు పదిహేనేళ్ల క్రితమే పెళ్లైంది.

వీరికి ముగ్గురు పిల్లలున్నారు. మద్యానికి, పేకాటకు బానిసైన గోపి భార్యతో తరుచూ గొడవపడుతున్నాడు.

దీంతో ఆమె మూడు నెలల క్రితం పుట్టింటికి వచ్చి తల్లితో కలిసి జీవిస్తుంది.

ఆమె పుట్టింటికి వచ్చినా గోపి వేధింపులు మాత్రం తగ్గలేదు.

తరుచూ డబ్బుల కోసం భార్యను పీడించసాగాడు.

అయితే, ఈ వివాదం ఇలా కొనసాగుతున్న సమయంలోనే తిరుపతమ్మ తల్లి బంగారు ఆభరణాల చోరి జరిగింది.

దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

రంగంలోకి దిగిన పోలీసులు సాంకేతిక ఆధారాల సాయంతో గోపియే నిందితుడని తేల్చారు.

అతని వద్ద నుండి ఆభరణలు రికవరీ చేశారు.

రంగంలోకి దిగిన పోలీసులు అనేక ఆధారాలు సేకరించిన తర్వాత గోపి నిందితుడిగా తేల్చి అతన్ని పట్టుకొని తమదైన శైలిలో విచారించారు. దీంతో గోపి తానే దొంగతనం చేసినట్లు ఒప్పుకొని బంగారు ఆభరణాలు తీసుకొచ్చి ఇచ్చాడు. దీంతో అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

Tags: Fueled by anger towards his wife, he broke into his mother-in-law’s house in the middle of the night—and looted everything!