May 9, 2026
Explore
మదనపల్లెలో మిద్ది పైనుంచి దూకేసి ఎంబీఏ విద్యార్థి మృతి

మదనపల్లెలో మిద్ది పైనుంచి దూకేసి ఎంబీఏ విద్యార్థి మృతి

May 9, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు:

మదనపల్లెలో మిద్దె పైనుంచి పడిన ఎంబీఏ విద్యార్థి శుక్రవారం రాత్రి మృతి చెందాడు. టూటౌన్ పోలీసుల కథనం మేరకు.. పుంగనూరు మండలం, కుక్కలపల్లికి చెందిన ఎంబీఏ విద్యార్థి గంగరాజు(24) మదనపల్లి ఇందిరా నగర్‌లోని ఉన్న తన స్నేహితుడి ఇంటికి వచ్చాడు. మిద్దె పై మాట్లాడుతుండగా ప్రమాదవశాత్తు కింద పడ్డాడు. వెంటనే అతడిని జిల్లా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.

Tags: MBA Student Dies After Jumping from Rooftop in Madanapalle