May 9, 2026
Explore
ఇంత సిస్టం నా రైల్వే పరిక్ష!

ఇంత సిస్టం నా రైల్వే పరిక్ష!

May 9, 2026 | Andhra Pradesh

తాళికి టేపు వేసి.. గాజులు, మెట్టెలు తీసివేయించి..

అమరావతిముచ్చట్లు:

గుంటూరు ల్ సెంటర్లో శుక్రవారం రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (ఆర్ఆర్బీ) పరీక్ష రాయడానికి వెళ్లిన అభ్యర్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

అక్కడి సిబ్బంది అభ్యర్థుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించారు.

వివాహితల మెడలోని మంగళసూత్రానికి టేపు వేయడంతో పాటు, మెట్టెలు, గాజులు తీయించారు. కమ్మలు, ముక్కుపుడకలను కూడా అనుమతించలేదు.

భక్తితో చేతికి కట్టుకున్న రక్ష కంకణాలను కూడా తెంచేశారు.

పరీక్షా కేంద్రాల నిబంధనల ప్రకారం..,

లోహపు వస్తువులు, మంగళసూత్రాలు, గాజులు, మతపరమైన ధార్మిక చిహ్నాలను ధరించిన అభ్యర్థుల విషయంలో ఇన్విజిలేటర్లు అప్రమత్తంగా ఉండాలని, అదనపు సిబ్బందితో పర్యవేక్షించాలని పేర్కొన్నారు.

దీనికి అదనపు సిబ్బందిని నియమించాల్సి వస్తోందని, నిర్వాహకులు ఈ విధంగా వ్యవహరించారని పలువురు వాపోయారు.

Tags:My railway exam—what an elaborate system!