▪️పెట్రోకెమికల్స్ డిప్లొమా కోర్సులు.
అమరావతిముచ్చట్లు:
భారత ప్రభుత్వ సంస్థ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమి కల్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (సీపెట్)- విజయవాడలో 10వ తరగతి అర్హతతో మూడేళ్ల డిప్లొమా ఇన్ ప్లాస్టిక్ టెక్నాలజీ(డీపీటీ), డీపీఎంటీ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ మేరకు డైరెక్టర్ సీహెచ్ శేఖర్, కొల్లు వెంకటరమణ ఫౌండేషన్ అధ్యక్షుడు కొల్లు ఆనంద్ తెలిపారు. ఈ కోర్సులకు ఏపీ ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ సదుపాయం ఉందన్నారు. ఆసక్తి గల వారు ఈనెల 28లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. వచ్చే నెల 7న ప్రవేశపరీక్ష ఉంటుందన్నారు. ర్యాంకు ఆధారంగా విజయవాడ కేంద్రంలోని 120 సీట్లను భర్తీ చేస్తారన్నారు. వివరాలకు 7893586494 సంప్రదించాలన్నారు.
Tags; Applications for CIPET Diploma Courses