▪️నూతన కోర్టుల భవనం ప్రారంభోత్సవానికి హాజరు.
రాజమహేంద్రవరం ముచ్చట్లు:
హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ లీసా గిల్ శనివారం రాజమహేంద్రవరంలో పర్యటించనున్నారు. నగరంలో నూతనంగా నిర్మించిన పది కోర్టుల సముదాయ భవనాన్ని ఉదయం 10.30 గంటలకు ప్రారంభించనున్నారని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత తెలిపారు. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ ఆర్. రఘునందన్ రావు, జస్టిస్ సుమతి జగడం, జస్టిస్ న్యాపతి విజయ్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారన్నారు. జస్టిస్ బట్టు దేవానంద్ జిల్లా పరిపాలనా న్యాయమూర్తిగా కార్యక్రమంలో పాల్గొంటారని వివరించారు.
Tags: AP High Court Chief Justice Lisa Gill’s Visit to Rajahmundry Today