- వేలాదిగా రానున్న జనం.
- పటిష్టమైన బందోబస్తు.
పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలోని చెరువు కట్టపై గల సయ్యద్ నూర్‌షావలి బాబా దర్గా వారి ఉరుసు మహ్గత్సవం ముస్లింలు శుక్రవారం రాత్రి భక్తి శ్రద్దలతో ప్రారంభించారు. పట్టణంలోని కుమ్మరవీధిలో గల పహిల్వాన్‌సాబ్ ఇంటి నుంచి దర్గా వరకు గంధంను ఫకీర్ల జోహార్లతో , బాణసంచా వేడుకలతో ఊరేగింపుగా వచ్చి ఉరుసు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా దర్గాలో చాదర్, పూల దండలు వేసి ముస్లిం పెద్దలు ప్రార్థనలు నిర్వహించారు.
పటిష్టమైన బందోబస్తు …..
పట్టణంలోని చెరువు కట్టపై గల సయ్యద్ నూర్‌షావలి బాబా దర్గా వారి ఉరుసు సందర్భంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండ పటిష్టమైన బందోబస్తు నిర్వహిస్తున్నట్లు మదనపల్లె డిఎస్పీ పావని తెలిపారు. శుక్రవారం ఆమె సీఐ సుబ్బరాయుడు,ఎంవిఐ సుప్రియ, కమిటి సభ్యులు యూసఫ్, అస్లాంమురాధి, మౌల తదితరులతో కలసి ఉరుసు, ఖవ్వాలి పాటలు జరిగే ప్రాంతాలను, దర్గా ప్రాంతాన్ని సందర్శించారు. ట్రాఫిక్ మళ్లింపు, పార్కింగ్‌తో పాటు ప్రజలకు అవసరమైన ఏర్పాట్లను పరిశీలించారు.
నేడు ఖవ్వాలి పాటలపోటీలు….
పట్టణంలోని సయ్యద్ నూర్‌షావలి బాబా దర్గా ఉరుసు సందర్భంగా దర్గా కమిటి వారిచే ఖవ్వాలి పాటల ఖచ్చేరి ఏర్పాటు చేశారు. శని, ఆదివారాలలో ఖవ్వాలి పాటలను నాగపూర్‌కు చెందిన ఇంతియాజ్‌సాబిరి, ముంబైకి చెందిన అంజాబ్‌సాబిరి , పూనేకు చెందిన తౌసిఫ్‌జునైది , కర్నాటకాకు చెందిన తౌసిఫ్‌ఖాదరి లచే జరగనున్నది.




Tags: The Urs of Syed Noor Shah Wali Baba was celebrated with devotion and reverence.