May 8, 2026
Explore
రైతులు ఏపిఏఐఎంఎస్‌ 2.0 యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి

రైతులు ఏపిఏఐఎంఎస్‌ 2.0 యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి

May 8, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

పుంగనూరు వ్యవసాయశాఖ పరిధిలోని రైతులందరు ఏపిఏఐఎంఎస్‌ 2.0 యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని ఏడి శివకుమార్‌ సూచించారు. శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రైతులకు అవసరమైన అన్ని విషయాలను యాప్‌ ద్వారా తెలియజేయడం జరుగుతుందన్నారు. ఇప్పటి వరకు 6,560 మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారని, 11 వేల మంది లక్ష్యంగా ఉందన్నారు. దీని ద్వారా రైతులకు అవసరమైన సమాచారం, పంట నష్టాలు, సలహాలు, సూచనలతోపాటు రైతులకు అవసరమైన అన్ని విషయాలు అందుబాటులో ఉంటుందన్నారు. తక్షణమే యాప్‌ను గూగుల్‌ప్లేస్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలని , లేదా ఆర్‌ఎస్‌కెలకు వెళ్లి సిబ్బంది ద్వారా చేయించుకోవాలన్నారు.

Tags: Farmers must download the APAIMS 2.0 app.