అమరావతిముచ్చట్లు:
తెలుగు రాష్ట్రాల్లో మే నెలలోనే ఎండలు తీవ్రంగా మండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో, 2026లో రోహిణి కార్తె మే 25 నుంచి జూన్ 2 వరకు ఉంటుందని, ఈ సమయంలో అధిక వేడి గాలులు, తీవ్రమైన ఎండలు, అగ్నిప్రమాదాలు, ఉక్కపోత ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ప్రజలు, ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు మధ్యాహ్నం వేళ బయటకు రావద్దని, డీహైడ్రేషన్ బారిన పడకుండా ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. మట్టికుండ నీళ్లు, మజ్జిగ, పండ్ల రసాలు వంటివి తీసుకోవాలని, వేపుళ్లు, మసాలా పదార్థాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.
Tags:Rohini Karte: Intense heat expected starting May 25—precautions are mandatory!