మదనపల్లె ముచ్చట్లు:
అన్నమయ్య జిల్లా మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో పనిచేస్తున్న మహిళా జూనియర్ అసిస్టెంట్‌పై అదే విభాగానికి చెందిన మరో ఉద్యోగి దాడి చేసిన ఘటన కలకలం రేపింది. ఆస్పత్రిలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న సాయి, స్కానింగ్ రూములో పలువురు ప్రజలు చూస్తుండగానే తనపై దాడి చేశాడని బాధితురాలు నందిని ఆరోపించింది.
ఈ ఘటన బుధవారం చోటుచేసుకోగా గురువారం వెలుగులోకి వచ్చింది. ఘటనపై ఆస్పత్రి వర్గాలు, పోలీసులు విచారణ చేపట్టినట్లు సమాచారం.
Tags: Female Employee Attacked at Madanapalle District Hospital