మదనపల్లె ముచ్చట్లు:
ప్రభుత్వ పెన్షనర్లకు జనవరి 2026లో చెల్లించాల్సిన 30 నెలల డీఆర్, డిఎన్ఎస్ రిలీఫ్ బకాయిలు అందరికీ జమ కాలేదని ఆంధ్రప్రదేశ్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు డా. ఎన్. ముని గోపాలకృష్ణ తెలిపారు. గురువారం మదనపల్లెలో అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ లోకేష్ బాబును కలిసి సమస్యను వివరించారు.
ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు పెన్షనర్ల బకాయిలను వెంటనే చెల్లించాలని వినతిపత్రం అందజేశారు. దీనిపై స్పందించిన ఏటిఓ లోకేష్ బాబు, ఎస్టిఓ నరేష్ పెండింగ్‌లో ఉన్న వారందరి పేర్లు నమోదు చేసి బకాయిలు జమ చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు, పెన్షనర్స్ నాయకులు పాల్గొన్నారు.
పెన్షనర్లకు డీఆర్, డిఎన్ఎస్ బకాయిలు చెల్లించాలి- డా. ముని గోపాలకృష్ణ
ప్రభుత్వ పెన్షనర్లకు జనవరి 2026లో చెల్లించాల్సిన 30 నెలల డీఆర్, డిఎన్ఎస్ రిలీఫ్ బకాయిలు అందరికీ జమ కాలేదని ఆంధ్రప్రదేశ్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు డా. ఎన్. ముని గోపాలకృష్ణ తెలిపారు. గురువారం మదనపల్లెలో అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ లోకేష్ బాబును కలిసి సమస్యను వివరించారు.
ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు పెన్షనర్ల బకాయిలను వెంటనే చెల్లించాలని వినతిపత్రం అందజేశారు. దీనిపై స్పందించిన ఏటిఓ లోకేష్ బాబు, ఎస్టిఓ నరేష్ పెండింగ్‌లో ఉన్న వారందరి పేర్లు నమోదు చేసి బకాయిలు జమ చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు, పెన్షనర్స్ నాయకులు పాల్గొన్నారు.
Tags; DR and DNS Arrears Must Be Paid to Pensioners: Dr. Muni Gopalakrishna