May 8, 2026
Explore
చనువుగా ఉంటూ రూ.5.20 లక్షలు కాజేసిన సైబర్ నేరగాడు

చనువుగా ఉంటూ రూ.5.20 లక్షలు కాజేసిన సైబర్ నేరగాడు

May 8, 2026 | Andhra Pradesh

వాల్మీకిపురo ముచ్చట్లు:

వాల్మీకిపురానికి చెందిన రిటైర్డ్ రైల్వే ఉద్యోగి శివానందాన్ని సైబర్ నేరగాడు మోసగించిన ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితుడు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదు ప్రకారం.. గత నెలలో విహారయాత్ర నిమిత్తం కలకత్తాకు వెళ్లిన శివానందానికి అంకిత్ కుమార్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. ఆలయాలకు కారులో తీసుకెళ్తానని నమ్మించి చనువుగా మెలిగిన అనంతరం అతని ఫోన్ ద్వారా రూ.5.20 లక్షలు కాజేసినట్లు బాధితుడు పేర్కొన్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Tags: Cyber ​​Criminal Swindles ₹5.20 Lakhs by Posing as a Close Acquaintance