కర్ణాటకలో అక్కాతమ్ముళ్ల వివాహం.. కుటుంబాలలో కలకలం
చిక్కబళ్లాపూర్ ముచ్చట్లు:
కర్ణాటక రాష్ట్రంలోని చిక్కబళ్లాపూర్ జిల్లాలో రక్త సంబంధం ఉన్న అక్కాతమ్ముళ్లు వివాహం చేసుకున్న ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. శశికళ, ప్రవీణ్ అనే యువతి–యువకులు గత మూడు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నట్లు తెలిపారు. వీరి తల్లులు సొంత అక్కాచెల్లెళ్లు కావడంతో ఇద్దరూ దగ్గరి బంధువులు అవుతారు.
ఇటీవల శశికళకు కుటుంబ సభ్యులు వేరొకరితో వివాహం నిశ్చయించడంతో, ఆమె ప్రవీణ్‌తో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకుంది. అనంతరం తమకు కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందంటూ రక్షణ కోసం పోలీసులను ఆశ్రయించారు.
పోలీసులు ఇరు కుటుంబాలతో మాట్లాడి వారిని ఒప్పించే ప్రయత్నం చేసినప్పటికీ, శశికళ మాత్రం తాను భర్త ప్రవీణ్‌తోనే ఉంటానని స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ ఘటన ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఇంకా రక్త సంబంధాలు ఉన్నాయా అని కొంతమంది నోటి మీద వేలు వేసుకుంటున్నారు.
Tags: Look at this, man—damn them! Is their time finally up?