మదనపల్లె ముచ్చట్లు:
అన్నమయ్య జిల్లా పోలీసులు భారీ ఎత్తున చోరీ, జారవిడచుకున్న మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బుధవారం మదనపల్లె నూతన ఎస్పీ కార్యాలయంలో డిఐజి కోయ ప్రవీణ్ మాట్లాడుతూ.. టెక్నాలజీని ఉపయోగించి చోరీ కాబడిన మొబైల్ ఫోన్లతో పాటు, జారవిడచుకున్న మొబైల్ ఫోన్లను రూ.1.56,36 కోట్ల విలువైన 716 తమ టెక్నీకల్ సిబ్బంది తిరిగి స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. అవన్నీ బాధితులకు అందజేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ధీరజ్, ఏఎస్పి వెంకటాద్రి తదితరులు పాల్గొన్నారు.
Tags: We Recovered Mobile Phones Worth Rs 1.56 Crore Using Technology: DIG