May 8, 2026
Explore
సిబ్బంది సంక్షేమమే మా ధ్యేయం

సిబ్బంది సంక్షేమమే మా ధ్యేయం

May 8, 2026 | Andhra Pradesh

విజయవంతంగా కొనసాగుతున్న ‘SP-SAMPARK’

అనకాపల్లి ముచ్చట్లు:

జిల్లా పోలీసు శాఖలో పనిచేస్తున్న సిబ్బంది సంక్షేమానికి పెద్దపీట వేస్తూ, జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాల మేరకు అమలులోకి వచ్చిన ‘SP-SAMPARK’ ఫోన్-ఇన్ కార్యక్రమం జిల్లా పోలీసు కార్యాలయంలో అదనపు ఎస్పీ ఎల్.మోహన రావు, స్వయంగా ఫోన్ లైన్ ద్వారా సిబ్బంది సమస్యలను ఆలకించి, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టారు.

నాయకత్వానికి మరియు క్షేత్రస్థాయి సిబ్బందికి మధ్య ఉన్న దూరాన్ని తగ్గించి, సిబ్బంది తమ వ్యక్తిగత లేదా వృత్తిపరమైన ఇబ్బందులను ఎటువంటి సంకోచం లేకుండా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చేలా ఈ ‘SP-SAMPARK’ వేదికను రూపొందించడం జరిగింది.

జిల్లావ్యాప్తంగా వివిధ విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బంది ఫోన్ నంబర్ 93469 12011 ద్వారా అదనపు ఎస్పీ తో మాట్లాడారు.

సిబ్బంది ప్రధానంగా సర్వీస్ పరమైన పోస్టింగ్స్, బదిలీలు, సెలవులు మరియు కుటుంబ ఆరోగ్య సమస్యలను వివరించారు.

ప్రతి సమస్యను లోతుగా విశ్లేషించిన అదనపు ఎస్పీ , వాటిని నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని సంబంధిత శాఖాధికారులను ఆదేశించారు.
​”కానిస్టేబుల్ నుండి హోమ్ గార్డు వరకు ప్రతి ఒక్కరి సమస్యను పరిష్కరించడమే మా ప్రాధాన్యత. దూర ప్రాంతాల నుండి కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, సిబ్బంది తమ సమస్యలను నేరుగా నాతో పంచుకోవచ్చు. ప్రతి సమస్యను గోప్యంగా ఉంచుతూ త్వరితగతిన పరిష్కారం చూపుతాం.”
— ఎల్.మోహన రావు, జిల్లా అదనపు ఎస్పీ.

ఈ కార్యక్రమం ప్రతి శుక్రవారం ఉదయం 11:00 గంటల నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు నిరంతరాయంగా కొనసాగుతుంది. ప్రతి ఫిర్యాదును డిజిటల్ రిజిస్టర్‌లో నమోదు చేసి, పరిష్కారం అయ్యే వరకు పర్యవేక్షించడం జరుగుతుంది.

​ఈ కార్యక్రమంలో
ఇన్స్పెక్టర్ లు బాల సూర్యారావు, లక్ష్మి, ఏ.వో సి.హెచ్.తిలక్ బాబు, ఆఫీస్ సూపరింటెండెంట్ ప్రతాప్ శేషయ్య, మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Tags: Employee welfare is our objective.