వర్గల్ ముచ్చట్లు:
సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నాచారంలో విషాదం చోటు చేసుకుంది. హల్దీవాగులో ఈతకు వెళ్లి ముగ్గురు యువకులు మృతి చెందారు.మృతులను నర్సాపూర్నకు చెందిన ప్రశాంత్ (27), వికాస్ (27), ఆనంద్రరెడ్డి (27)గా గుర్తించారు. గౌరారం ఎస్సై ఆరోగ్యం వెల్లడించిన వివరాల ప్రకారం.. వీళ్లంతా బుధవారం నాచారం లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వెళ్లారు.ఆ తర్వాత ఆలయం సమీపంలోని హల్దీ వాగులో వికాస్, ఆనంద్ రెడ్డి స్నానానికి దిగారు. ఈత రాకపోవడంతో వాగులో మునిగితేలుతుండగా.. గట్టుపై ఉన్న ప్రశాంత్ వారిని కాపాడేందుకు నీటిలో దిగాడు. ఆయనకు కూడా ఈత రాకపోవడంతో మొత్తం ముగ్గురూ గల్లంతై నీట మునిగారు.గురువారం ఉదయం పోలీసులు గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం కోసం గజ్వేల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు.
Tags: Three Youths Drown While Swimming in Haldivagu