హైదరాబాద్ ముచ్చట్లు:
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈనెల 10న హైదరాబాద్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఇందులో జహీరాబాద్లో ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ స్మార్ట్సటీకి శంకుస్థాపనతోపాటు వరంగల్లో పీఎం మిత్ర మెగా టెక్స్టైల్పార్క్ సహా వివిధ ప్రాజెక్టులు ఉన్నాయి. భాజపా నిర్వహించే బహిరంగ సభలోనూ ప్రధాని పాల్గొంటారు. మోదీ మూడోసారి ప్రధానమంత్రి అయ్యాక రాష్ట్ర పర్యటనకు రానుండటం ఇదే తొలిసారి కావడంతో తెలంగాణ కమలదళం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని భారీ ఏర్పాట్లు చేస్తోంది.
Naresh Mudiraj✍️
👉హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి నుంచి అధికంగా
- పరేడ్ గ్రౌండ్లో బహిరంగ సభ కోసం రాష్ట్ర భాజపా భారీ ఏర్పాట్లు చేస్తోంది. ప్రధానంగా హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల నుంచి అధిక జనసమీకరణ చేస్తోంది. తెలంగాణలో ఇతర జిల్లాల నుంచి కూడా పెద్దసంఖ్యలో వస్తారని.. మొత్తం 50 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి రెండు లక్షల మంది వచ్చేలా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతంరావు తెలిపారు. కాగజ్నగర్, ఖమ్మం, మహబూబ్నగర్, పెద్దపల్లి నుంచి వచ్చే పార్టీ శ్రేణులు, అభిమానుల కోసం నాలుగు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. వీటితోపాటు మూడు వేల ఆర్టీసీ బస్సులనూ బుచ్చేసిన భాజపా.. కళాశాలలు, పాఠశాలల బస్సులనూ సభ కోసం సమీకరిస్తోంది. కేంద్రమంత్రి కిషన్రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు మోదీ సభ ఏర్పాట్లు, జనసమీకరణపై పార్టీ నాయకులతో బుధవారం సమావేశమై చర్చించారు.
👉ఇదీ షెడ్యూల్
- బెంగళూరులో ఆదివారం మధ్యాహ్నం 1.10 గంటలకు ప్రధాని ప్రత్యేక విమానంలో బయలుదేరి 2.20 గంటలకు హైదరాబాద్లోని బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు.
- మధ్యాహ్నం 2:30 నుంచి 3:00 గంటల వరకు పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేస్తారు. ఈ అధికారిక కార్యక్రమాలను తొలుత హెచ్ఐసీసీలో నిర్వహించాలనుకోగా సాంకేతిక కారణాలతో బేగంపేట ఎయిర్పోర్టు ప్రాంగణంలోనే చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.
- మధ్యాహ్నం 3.15 గంటలకు హెలికాప్టర్లో బయల్దేరి హైటెక్ సిటీకి వెళ్లి సింధు ఆసుపత్రిని ప్రారంభించి అక్కడి వైద్యనిపుణులతో మాట్లాడతారు. అనంతరం అక్కడ్నుంచి బయల్దేరి బేగంపేట ఎయిర్ పోర్టుకు 4.40 గంటలకు చేరుకుంటారు.
- సాయంత్రం 5.25 గంటలకు బేగంపేట నుంచి రోడ్డుమార్గంలో బయల్దేరి 5.30 గంటలకు పరేడ్ గ్రౌండ్కు చేరుకుంటారు. 5.30 నుంచి 6.30 వరకు భాజపా బహిరంగ సభలో పాల్గొంటారు. సభఅనంతరం బేగంపేటకు చేరుకుని.. సాయంత్రం 6.45 గంటలకు ప్రత్యేక విమానంలో గుజరాత్లోని జామ్నగర్కు బయలుదేరుతారు.
Tags; Prime Minister Modi to visit Hyderabad on the 10th.