May 7, 2026
Explore
అక్కడ వర్షాలు, ఇక్కడ ఎండలు

అక్కడ వర్షాలు, ఇక్కడ ఎండలు

May 7, 2026 | Andhra Pradesh

.. తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో

అమరావతిముచ్చట్లు:

తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు తీవ్ర ఎండలు, ఉక్కపోతతో అల్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ కీలక అప్‌డేట్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రాగల మూడు రోజులు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో 40-50 కి.మీ వేగంతో ఈదురు గాలులు కూడా వీచే అవకాశం ఉంది. ఎండలు కొనసాగుతూనే వర్షాలు కురుస్తాయని నివేదిక పేర్కొంది.


తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జనం అల్లాడిపోతున్నారు. ఓ వైపు వేడి.. మరోవైపు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో 45 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.. ఈ తరుణంలో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఎండలతో పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్, యానంలో దిగువ ట్రోపో ఆవరణములో ఆగ్నేయ, నైరుతి గాలులు వీస్తున్నాయి.


👉ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు.
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం

  • గురువారం, శుక్రవారం, శనివారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురు గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

👉దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్

  • గురువారం, శుక్రవారం, శనివారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురు గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

👉రాయలసీమ

  • గురువారం, శుక్రవారం, శనివారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురు గాలులు గంటకు 30 -40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

👉తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ విశ్లేషణ వాతావరణ హెచ్చరికలు

  • హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం.. నిన్న ఉత్తర అంతర్గత కర్ణాటక గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు సగటు కొనసాగిన ఉత్తర దక్షిణ ద్రోణి ఈరోజు ఉదయం బలహీనపడింది. ఉత్తర తెలంగాణ – దాని పరిసర ప్రాంతాల్లో నిన్న ఏర్పడిన ఉపరితల చక్రవాత ఆవర్తనం ఈరోజు బలహీనపడింది. రాష్ట్రంలో క్రింది స్థాయి గాలులు ప్రధానంగా దక్షిణ, ఆగ్నేయ దిశల నుంచి వీచుచున్నవి.
  • రాగల 3 రోజులకు వాతావరణ సూచన: (Weather Forecast) గురువారం, శుక్రవారం, శనివారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలో రానున్న మూడు రోజులలో గరిష్ట ఉష్ణోగ్రతలు ఇంచుమించు ఇదే స్థాయిలో కొనసాగే అవకాశం ఉంది.

👉వాతావరణ హెచ్చరికలు

  • ఈరోజు, రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో జిల్లాలలో ఉరుములు మెరుపులు, 30 నుండి 40 కి.మీ వేగం కలిగిన ఈదురు గాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

Tags; Rains there, scorching heat here.