May 7, 2026
Explore
19లోపు వ్యవసాయ పనిముట్లుకు ధరఖాస్తు చేయండి

19లోపు వ్యవసాయ పనిముట్లుకు ధరఖాస్తు చేయండి

May 7, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

రైతులకు సబ్సిడి ధరపై వ్యవసాయ పనిముట్లు పొందేందుకు ఈనెల 19లోపు ధరఖాస్తు చేయాలని ఏడి శివకుమార్‌ తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వాదేశాల మేరకు ట్రాక్టర్లు, గొర్రులు, కోతనూర్పిడి యంత్రాలు, పవర్‌టిల్లర్లు, స్ప్రేయర్లు తదితర వస్తువులను అందించనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల రైతులకు, ఎస్సీ, ఎస్టీ, చిన్న, సన్నకారు రైతులకు 40శాతం, 50 శాతం సబ్సిడితో ఇవ్వనున్నట్లు తెలిపారు. రైతులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Tags: Apply for agricultural tools by the 19th.