పుంగనూరుముచ్చట్లు:
మండలంలోని మార్లపల్లె గ్రామ సరిహద్దులో బండలపై నిర్మించిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వరస్వామి తృతీయ వార్షికోత్సవ సందర్భంగా స్వామివార్ల ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేసి , వేదపండితులు స్వామివార్ల కళ్యాణోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా గోవిందనామస్మరణతో ఆప్రాంతం భక్తిపారవశ్యమైంది. మార్లపల్లె గ్రామస్తులతో పాటు పరిసర గ్రామాలకు చెందిన వందలాది మంది కళ్యాణోత్సవ వేడుకల్లో హాజరై పూజలు చేశారు. ఈ సందర్భంగా భక్తులకు తీర్థప్రసాదాలు , అన్నదాన వితరణ కార్యక్రమాలు నిర్వహించారు.
Tags: Kalyanotsavam for Lord Venkateswara in Marlapalle