- వైభవంగా ప్రారంభమైన ఉరుసు
-నాలుగు రోజుల పాటు ఉరుసు - వేలాదిగా రానున్న జనం.
- పటిష్టమైన బందోబస్తు.
పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలోని చెరువు కట్టపై గల సయ్యద్ నూర్‌షావలి బాబా దర్గా వారి ఉరుసు మహోత్సవం శతాబ్దికాలంగా ముస్లింలు నిర్వహిస్తున్నారు. ఈ ఉరుసు గురువారం నూరాని గంధంతో లాంచనంగా ప్రారంభమైంది. శుక్రవారం పట్టణంలోని కుమ్మరవీధిలో ఉండు పహిల్వాన్‌సాబ్ ఇంటి నుంచి దర్గా వరకు గంధంను ఫకీర్ల జోహార్లతో , బాణసంచా వేడుకలతో ఊరేగింపుగా తీసుకొచ్చి దువ్వ చేస్తారు. ప్రతి రోజు ఉరుసుకు వచ్చే వారికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ఖవ్వాలి పాటలపోటీలు….
పట్టణంలోని సయ్యద్ నూర్‌షావలి బాబా దర్గా ఉరుసు సందర్భంగా ప్రతి రోజు రాత్రి దర్గా కమిటి వారిచే ఖవ్వాలి పాటల ఖచ్చేరి ఏర్పాటు చేశారు. 9, 10 తేదీలలో రాత్రి నాగపూర్‌కు చెందిన ఇంతియాజ్‌సాబిరి, ముంబైకి చెందిన అంజాబ్‌సాబిరి , పూనేకు చెందిన తౌసిఫ్‌జునైది , కర్నాటకాకు చెందిన తౌసిఫ్‌ఖాదరి లచే ఖవ్వాలి పాటల పోటీలు ప్రజలను ఉర్రుతలూగించనున్నది.
ఏర్పాట్లు….
చెరువు కట్ట పై గల సయ్యద్ నూర్‌షావలి బాబా దర్గాను విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఉరుసు సందర్భంగా ముస్లిం మతపెద్దలు దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఉరుసును ప్రతి ఏటా ఎన్‌ఎస్.పేటలోగల ప్రభుత్వ కళాశాల మైదానం నిర్వహించడం ఆనవాయితీ. ఈ మేరకు రహదారికి ఇరువైపుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. మైదానంలో వివిధ రకాల రంగుల రాట్నాలు, దుకాణాలను ఏర్పాటు చేశారు. ఉరుసు నాలుగు రోజులు పాటు జరుగుతుంది. కానీ 10 రోజుల పాటు ఉరుసు కార్యక్రమం జరుగతుంది. ఉరుసులో పాల్గొనేందుకు ఆంధ్ర, కర్నాటక, తమిళనాడు, కేరళ నుంచి కూడ వేలాది మంది ఉరుసు మహోత్సవంలో పాల్గోనేందుకు తరలివస్తున్నారు. కమిటి ఆధ్వర్యంలో సీఐ సుబ్బరాయుడు, పోలీసులు బందోబస్తు, ట్రాఫిక్ ఏర్పాట్లను చేపట్టారు. బెంగళూరు రహదారి కావడంతో వాహనాల మళ్ళింపు కార్యక్రమం చేపట్టారు.

Tags: The Urs of Syed Noor Shah Wali Baba, celebrated for centuries.