పహల్గామ్ ముచ్చట్లు:
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ నేటితో (మే 7) ఏడాది పూర్తి చేసుకుంది. 2025 మే 7 తెల్లవారుజామున 1:05 గంటలకు భారత సైన్యం కేవలం 25 నిమిషాల్లో 24 క్షిపణులతో పాక్లోని 9 ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది. ఈ దాడిలో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. భారత శౌర్యానికి నిదర్శనమైన ఈ ఆపరేషన్, సరిహద్దు దాటి వచ్చి దాడి చేసే శత్రువులకు గట్టి హెచ్చరికగా నిలిచింది.
Tags: One year since Operation Sindoor