May 7, 2026
Explore
మహిళా శక్తి టీం ఆధ్వర్యంలో విస్తృత అవగాహన కార్యక్రమాలు.

మహిళా శక్తి టీం ఆధ్వర్యంలో విస్తృత అవగాహన కార్యక్రమాలు.

May 7, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు:

  • మహిళలు, చిన్నారుల భద్రతపై ప్రజలకు చైతన్యం.
  • సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సూచనలు.
  • గుడ్ టచ్ – బ్యాడ్ టచ్, బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థపై అవగాహన, అత్యవసర టోల్ ఫ్రీ నంబర్లపై ప్రజలకు సమాచారం.
  • ట్రాఫిక్ నియమాలు, సోషల్ మీడియా దుష్ప్రభావాలపై సూచనలు.

తిరుపతి : తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు, మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ శ్రీలత ఆధ్వర్యంలో శక్తి టీం పోలీసులు జిల్లా వ్యాప్తంగా విస్తృత అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఇందులో భాగంగా భాగ్యనగరం గ్రామంలో శక్తి టీం పోలీసులు గ్రామ సభ నిర్వహించి మహిళలు, చిన్నారుల భద్రతకు సంబంధించిన పలు అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ముఖ్యంగా గుడ్ టచ్ – బ్యాడ్ టచ్, చిన్నారులపై దాడులు, చిన్నారుల కిడ్నాప్‌లు, చిన్నారుల అదృశ్యం, బాల కార్మిక వ్యవస్థ, బాల్య వివాహాలు వంటి అంశాలపై వివరించారు. అదేవిధంగా మొబైల్ గేమ్స్, సెల్ ఫోన్లు, సోషల్ మీడియా దుష్ప్రభావాలు, మహిళలు మరియు చిన్నారులపై జరుగుతున్న నేరాలు, కేస్ స్టడీస్ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు.

అలాగే ఆన్‌లైన్ మోసాలు, గుర్తు తెలియని లింకులు, వీడియో కాల్స్, డ్రగ్స్, మహిళల అక్రమ రవాణా, సైబర్ క్రైమ్, మహిళలపై జరిగే నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని, అత్యవసర పరిస్థితుల్లో వినియోగించాల్సిన టోల్ ఫ్రీ నంబర్ల గురించి ప్రజలకు వివరించారు.

అదే విధంగా వేసాలమ్మ దేవాలయం పరిసర ప్రాంతంలో కూడా శక్తి టీం పోలీసులు ప్రజలకు సాధారణ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. చిన్నారుల అదృశ్యం, కిడ్నాప్‌లు, చిన్నారులపై దాడులు, గుడ్ టచ్ – బ్యాడ్ టచ్, సైబర్ నేరాలు, చైన్ స్నాచింగ్ వంటి అంశాలపై ప్రజలకు సూచనలు ఇచ్చారు. ఎలాంటి అనుమానాస్పద వ్యక్తులు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

Tags: Extensive awareness programs organized under the aegis of the Mahila Shakti Team.