May 7, 2026
Explore
ఆడపిల్లల ట్రాప్ అండ్ చీటింగ్ కేసు

ఆడపిల్లల ట్రాప్ అండ్ చీటింగ్ కేసు

May 7, 2026 | Andhra Pradesh

హైదరాబాద్ ముచ్చట్లు:

జూబ్లీహిల్స్ సంపన్నుల ఆడపిల్లల ట్రాప్ అండ్ చీటింగ్ కేసులో వెలుగులోకి సంచలన విషయాలు..!

గతేడాదిలోనే అర్జున్‌పై ఫిర్యాదు చేసిన బాధితురాలు.. పలుమార్లు అర్జున్‌ను హెచ్చరించిన బాధితురాలి కుటుంబం.

పోక్సో కేసులో అరెస్ట్ అయ్యి బెయిల్‌పై వచ్చిన అర్జున్.. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు బాధితురాలైన మైనర్‌పై లైంగిక దాడి చేసి, 3 నెలల్లో బాధితురాలి నుంచి రూ.13 లక్షలు వసూలు చేసిన అర్జున్.

ఇంట్లో డబ్బు కనిపించకపోవడంతో ఫిర్యాదు చేసిన బాధితురాలి తండ్రి.. అర్జున్ తల్లి మీనాకుమారి బ్యాంక్ అకౌంట్‌లో డబ్బులు జమ అయినట్లు గుర్తించిన పోలీసులు.

అర్జున్‌పై మైనర్‌తో పాటు మరో బాధితురాలు ఫిర్యాదు.. ఈ కేసులో అర్జున్, తల్లి మీనాకుమారి, రాజీవ్, వారి స్నేహితులతో పాటు మొత్తం 11 మందిని నిందితులుగా చేర్చిన పోలీసులు.

Tags:Case of Trapping and Cheating Young Women