March 4, 2026
Explore
ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిధున్ రెడ్డి కీలక సూచనలు

ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిధున్ రెడ్డి కీలక సూచనలు

March 4, 2026 | Andhra Pradesh

ఢిల్లీ ముచ్చట్లు:

పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్న యుద్ద వాతావరణం నేపధ్యంలో అక్కడ నివసిస్తున్న ప్రవాసాంధ్రులకు వైయస్ఆర్సీపీ లోక్ సభా పక్ష నేత, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిధున్ రెడ్డి కీలక సూచనలు ..

ప్రస్తుత యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో అందరూ సురక్షితంగా ఉండాలని, అక్కడి దేశాల్లో పరిస్థితులు ఏవైనా మారుతున్నా, దయచేసి అప్రమత్తంగా ఉండి అక్కడి ప్రభుత్వాలు మరియు భారత రాయబార కార్యాలయం జారీ చేసే సూచనలు, మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని సూచించారు.

ఈ క్లిష్ట సమయంలో భారత ప్రభుత్వం మరియు విదేశాంగ మంత్రిత్వ శాఖ అన్ని చర్యలు తీసుకుంటున్నాయని తెలిపారు . ముఖ్యంగా Embassy of India మరియు Ministry of External Affairs జారీ చేసే ప్రకటనలను నిరంతరం పరిశీలించాలని కోరారు.

అవసరమైతే అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్లను ఉపయోగించాలని సూచించారు.

ఎటువంటి అత్యవసర పరిస్థితి వచ్చినా లేదా సహాయం అవసరమైనా, సంకోచించకుండా తన కార్యాలయాన్ని వెంటనే సంప్రదిస్తే, సంబంధిత అధికారుల ద్రుష్టికి తీసుకెళ్లి, సాధ్యమైనంత త్వరగా పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని చెప్పారు .ధైర్యంగా, అప్రమత్తంగా ఉండి మనందరం కలిసి ఈ క్లిష్ట పరిస్థితిని అధిగమిస్తామని భరోసా ఇచ్చారు.