“డ్రగ్స్‌పై సమాచారం ఇవ్వడం ప్రతి ఒక్కరి బాధ్యత”
మదనపల్లి ముచ్చట్లు:
అన్నమయ్య జిల్లా మదనపల్లిలో DW&CW&EO శాఖ ఆధ్వర్యంలో డ్రగ్స్ నిరోధం మరియు అవగాహనపై జిల్లా స్థాయి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా EAGLE సెల్ ప్రతినిధులు పాల్గొని అధికారులు, సిబ్బందికి సమగ్ర అవగాహన కల్పించారు. మాదకద్రవ్యాల వినియోగం వల్ల వ్యక్తిగత ఆరోగ్యం, కుటుంబం, సమాజంపై కలిగే ప్రభావాలను వివరించి, ముఖ్యంగా యువత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. NDPS చట్టం కింద ఉన్న కఠిన శిక్షలను వివరించారు. అనుమానాస్పద కార్యకలాపాలపై వెంటనే సమాచారం ఇవ్వాలని, EAGLE టోల్ ఫ్రీ నంబర్ 1972, వాట్సాప్ నంబర్ 8688830014 ను వినియోగించాలని తెలిపారు. డ్రగ్స్ నియంత్రణలో ప్రజల సహకారం అత్యవసరమని పేర్కొన్నారు.
Tags: Awareness Program on Drug Prevention in Madanapalle