పీలేరు ముచ్చట్లు:
అన్నమయ్య జిల్లా, పీలేరులో గర్నిమిట్టకు చెందిన ఓ వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుని మృతిచెందడం తీవ్ర కలకలం రేపుతుంది. కదిరి రైల్వే పోలీసుల కథనం మేరకు.. కెవిపల్లె మండలం. గర్నెమెట్టకు చెందిన షాబుద్దీన్(45) సొంత పనిమీద శుక్రవారం రాత్రి పీలేరుకు వచ్చాడు. ఇంతలో ఏంకష్టం వచ్చిందో ఏమో పీలేరు – చిత్తూరు రోడ్డు మార్గంలో ఉన్న రైలు పట్టాలు వద్దకు చేరుకుని, తిరుపతి మార్గంలోరైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలను పోలీసులు వెల్లడించాల్సి ఉంది.
Tags: Resident of Garnimitta commits suicide by jumping under a train in Pileru.