– వెంటనే ఆదుకోవాలని రైతు సంఘం డిమాండ్
రామాపురం ముచ్చట్లు:
రామాపురం మండలంలో సోమవారం సాయంత్రం వీచిన అకాల గాలివానలతో మామిడి తోటలకు తీవ్ర నష్టం సంభవించింది. కాయలతో నిండిన చెట్ల నుంచి మామిడి కాయలు భారీగా నేలపై రాలిపోవడంతో రైతులు ఆర్థికంగా దెబ్బతిన్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి వంగిమల్ల రంగారెడ్డి నల్లగుట్టపల్లి పంచాయతీ పరిధిలోని తోటలను పరిశీలించారు. నష్టాన్ని అంచనా వేసి నివేదికలు పంపాలని అధికారులను కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను వెంటనే ఆదుకుని సబ్సిడీలు, పంట బీమా త్వరగా మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
Tags: Farmers Suffer Severe Losses Due to Untimely Storms