– 4 కిలోల వెండి, బంగారం స్వాధీనం
మదనపల్లి ముచ్చట్లు:
అన్నమయ్య జిల్లా లో దేవాలయాలను లక్ష్యంగా చేసుకుని చోరీలు చేస్తున్న మహారాష్ట్ర అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు పట్టుకున్నారు. నలుగురు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి సుమారు 4 కిలోల వెండి వస్తువులు, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల జరిగిన ఆలయ చోరీలపై ప్రత్యేక దృష్టి పెట్టిన పోలీసులు చంద్ర కాలనీ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న వారిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ముఠా వాయల్పాడు, బత్తలపల్లి సహా పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడినట్లు ఎస్పీ తెలిపారు.
Tags: Inter-state Gang Behind Attacks on Temples Arrested