May 5, 2026
Explore
మదనపల్లిలో ట్రాఫిక్ నియంత్రణకు 10 కంట్రోల్ బూత్‌లు ప్రారంభం

మదనపల్లిలో ట్రాఫిక్ నియంత్రణకు 10 కంట్రోల్ బూత్‌లు ప్రారంభం

May 5, 2026 | Andhra Pradesh

మదనపల్లి ముచ్చట్లు:

మదనపల్లిలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు జిల్లా పోలీస్ శాఖ సరికొత్త చర్యలు చేపట్టింది. పట్టణంలోని ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన 10 ఆధునిక ట్రాఫిక్ కంట్రోల్ బూత్‌లను జిల్లా ఎస్పీ ధీరజ్ మంగళవారం అన్నమయ్య సర్కిల్‌లో ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, మదనపల్లి పట్టణంలో రోజురోజుకూ పెరుగుతున్న వాహన రద్దీ కారణంగా ట్రాఫిక్ నిర్వహణ సవాలుగా మారిందన్నారు. ఈ బూత్‌లతో ట్రాఫిక్ సిబ్బందికి ఎండ, వానల నుండి రక్షణ లభించడంతో పాటు ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందించగలమన్నారు.

పట్టణంలోని అన్ని ముఖ్య కూడళ్లలో ఇలాంటి బూత్‌లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ట్రాఫిక్ నియమాలను పాటించి, రోడ్డు ప్రమాదాలు తగ్గించే దిశగా పోలీసులకు ప్రజలు సహకరించాలని ఎస్పీ పిలుపునిచ్చారు.

Tags: 10 Control Booths Launched for Traffic Management in Madanapalle