May 5, 2026
Explore
మోటకట్ల హైస్కూల్‌లో అడ్మిషన్ల జోష్

మోటకట్ల హైస్కూల్‌లో అడ్మిషన్ల జోష్

May 5, 2026 | Andhra Pradesh

ఇంటింటి ప్రచారంతో ప్రభుత్వ పాఠశాలకు ఆదరణ

సంబేపల్లి ముచ్చట్లు:

సంబేపల్లి మండలంలోని మోటకట్ల జిల్లా పరిషత్ హైస్కూల్ ఉపాధ్యాయులు విద్యార్థుల నమోదు కోసం ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. జగనన్న కాలనీ, నారాయణరెడ్డి పల్లి, ఎర్రగుంట్ల ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి తల్లిదండ్రులను కలుసుకుని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు.

పాఠశాలలో ఉన్న సౌకర్యాలు, పదో తరగతి ఫలితాలు, NMMS విజయాలు, క్రీడల్లో ప్రతిభపై అవగాహన కల్పిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి కరపత్రాలు పంపిణీ చేశారు. బస్సు సౌకర్యం ఉందని తెలియజేయడంతో తల్లిదండ్రుల్లో విశ్వాసం పెరిగింది.

ఈ ప్రచారానికి విశేష స్పందన లభించగా ఒక్కరోజులోనే 52 మందికి పైగా విద్యార్థుల అడ్మిషన్లకు సమ్మతి లభించింది. కార్యక్రమంలో డైట్ ఇన్‌చార్జి ప్రిన్సిపల్ మడితాటి నరసింహారెడ్డి, ప్రధానోపాధ్యాయిని చప్పిడి పద్మజ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Tags:Admissions are in full swing at Motakatla High School