..వారి కుటుంబాల్లో విషాదం నింపింది
నెల్లూరు ముచ్చట్లు:
చెరువులో అనధికారికంగా మట్టికోసం తీసిన గుంటలు ఇద్దరు చిన్నారులను మింగేశాయి అంటున్న స్థానికులు
👉మృతుల్లో 14 ఏళ్ల చందు వారి తల్లి,తండ్రులకు ఒక్క గానొక్క కొడుకు,లక్కీ కి సోదరులు ఉన్నప్పటి వారు దివ్యాంగులు కావడం యాక్టివ్ గా ఉండే లక్కీ చనిపోవడం తో ఆ రెండు కుటుంబాల్లో తీరని శోకం లో మునిగిపోయాయి
నెల్లూరు జిల్లా సైదాపురం మండల కేంద్రం లో తీవ్ర విషాదం నెలకొంది,ఈ మధ్యాహ్నం సైదాపురం బిసి కాలనికి చెందిన చల్లా చందు(14),వాకాటి లక్కీ(11) అనే ఇద్దరు చిన్నారులు తమ సమీపం లోని పెద్దచెరువు వద్దకు సరదాగా ఈత కోసం వెళ్ళి నీటిలో గుంటల్లో గల్లంతయ్యారు, అనంతరం సమాచారం అందుకున్న స్థానికులు బాలుర కోసం గాలింపు చర్యలు జరపగా బాలురు అప్పటికే నీటిలో మునిగి మరణించారని గుర్తించారు, వీరిలో చందు అనే బాలుడు వారి తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కొడుకు అయినట్టు బాలుడు తొమ్మిదవ తరగతి చదువుతుండగా, లక్కీ ఐదవ తరగతి పూర్తయినట్టు తెలుస్తుంది, చిన్నారుల మృతితో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది,గతం లో ఈ చెరువు లో అనధికారికంగా మట్టి కోసం తీసిన గుంటలుల్లో మునిగి పిల్లల ప్రాణాలు పోయాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.. ఘటనపై సైదాపురం పోలీసులు విచారణ చేపట్టారు..
Tags:The fun of swimming claimed the lives of two young children.