తిరుపతి ముచ్చట్లు:
జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఆదేశాల మేరకు తిరుపతిలోని రామచంద్ర పుష్కరిణి వద్ద ఆటో డ్రైవర్లకు ప్రత్యేక ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ విభాగం డీఎస్పీ డి. కొండయ్య నాయుడు, మోటారు వాహనాల పరిశీలకులు (MVI), తిరుపతి, అలాగే ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్లు పాల్గొని ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియమ నిబంధనలు, ప్రయాణికుల పట్ల మర్యాదపూర్వక ప్రవర్తన, క్రమశిక్షణతో విధులు నిర్వహించాల్సిన అవసరంపై అవగాహన కల్పించారు.
ఇటీవల కొంతమంది ఆటో డ్రైవర్లు ప్రజల వద్ద అధిక చార్జీలు వసూలు చేస్తున్నారనే వార్తలు వెలువడిన నేపథ్యంలో, అధికారులు ఈ అంశంపై ప్రత్యేకంగా స్పందించారు. ప్రయాణికుల నుండి నిర్నిత చార్జీలకు మించి డబ్బులు వసూలు చేయడం చట్టవిరుద్ధమని, అలాంటి చర్యలు ప్రజల్లో ఆటో డ్రైవర్లపై నమ్మకాన్ని దెబ్బతీస్తాయని తెలిపారు.
ఈ సందర్భంగా ట్రాఫిక్ డీఎస్పీ డి. కొండయ్య నాయుడు గారు మాట్లాడుతూ, నగరానికి వచ్చే యత్రికులు, ప్రజలకు ముందుగా ప్రతినిధులుగా ఉండేది ఆటో డ్రైవర్లే ఉంటారని, తిరుపతికి వచ్చే భక్తులు మరియు ప్రజలతో మర్యాదగా ప్రవర్తిస్తూ నిర్ణీత చార్జీలకే సేవలు అందించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించి అధిక చార్జీలు వసూలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
జిల్లా పోలీస్ శాఖ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, ఎవరైనా ఆటో డ్రైవర్లు అధిక చార్జీలు వసూలు చేసినట్లయితే సంబంధిత వివరాలతో సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్ 112కు సమాచారం అందించాలని పోలీసులు కోరారు.ఈ కార్యక్రమంలొ ట్రాఫిక్ స్టేషన్ సీఐ సంజీవి కుమార్ , మరియు సిబ్బంది ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.
Tags: Awareness Session on Traffic Rules for Auto Drivers