వాల్మీకిపురం ముచ్చట్లు:
అన్నమయ్య జిల్లా వాల్మీకిపురంలో బాలికపై సామూహిక అత్యాచారం జరిగినట్టు వచ్చిన వార్త కలకలం రేపింది. శుక్రవారం రాత్రి ఈ ఘటన వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. కేసుకు సంబంధించి అనుమానిత యువకులను పోలీసులు స్టేషన్‌కు పిలిపించి విచారణ జరుపుతున్నట్లు తెలిసింది.
అయితే ఈ ఘటనపై పోలీసుల నుంచి భిన్న సమాచారం వెలువడింది. ఎస్సై తిప్పేస్వామి, ఎస్‌హెచ్‌ఓ, సీఐ రాఘవరెడ్డి వివరణ ప్రకారం అత్యాచారం జరగలేదని పేర్కొన్నట్లు సమాచారం. ఈ ఘటనపై స్పష్టమైన వివరాలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది. పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారని సమాచారం.
Tags:Gang rape of a girl in Valmikipuram.