May 2, 2026
Explore
డీఎస్పీగా పదోన్నతి పొందిన డీసీఆర్బీ సీఐ ఎస్.లక్ష్మణమూర్తికి ఘన వీడ్కోలు

డీఎస్పీగా పదోన్నతి పొందిన డీసీఆర్బీ సీఐ ఎస్.లక్ష్మణమూర్తికి ఘన వీడ్కోలు

May 2, 2026 | Andhra Pradesh

అనకాపల్లి ముచ్చట్లు:

అనకాపల్లి జిల్లా క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (DCRB) ఇన్‌స్పెక్టర్‌గా విశేష సేవలు అందించిన ఎస్.లక్ష్మణమూర్తి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP)గా పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో అధికారులు మరియు సిబ్బంది ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు.

జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాల మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ ఎల్.మోహన రావు మాట్లాడుతూ… లక్ష్మణమూర్తి నిబద్ధతను కొనియాడారు. “గత మూడు దశాబ్దాలుగా పోలీస్ శాఖలో వివిధ హోదాల్లో పనిచేసి, లక్ష్మణమూర్తి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అదే స్ఫూర్తితో డీఎస్పీగా నూతన బాధ్యతలను కూడా సమర్థవంతంగా నిర్వహించి, శాఖకు మంచి పేరు తీసుకురావాలి” అని ఆకాంక్షించారు.ఎస్.బి డీఎస్పీ జీ.ఆర్.ఆర్.మోహన్ మాట్లాడుతూ.. డీఎస్పీగా పదోన్నతి పొంది డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయనున్న లక్ష్మణమూర్తి కి అభినందనలు తెలిపారు. ఆయన వృత్తి జీవితంలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు.ఈ వీడ్కోలు సభలో భాగంగా లక్ష్మణమూర్తి ని జిల్లా అధికారులు ఘనంగా సన్మానించి, జ్ఞాపికను అందజేశారు.ఈ కార్యక్రమంలో​ఏవో: సి.హెచ్.తిలక్ బాబు, ​ఇన్‌స్పెక్టర్లు: బాల సూర్యారావు, లక్ష్మి, సేనం రమేష్, పిల్లా రమేష్
​ఎస్సైలు: ప్రసాద్, రమణయ్య, సురేష్ బాబు, అంజిబాబు, ప్రసాద్, గిరి
మరియు జిల్లా పోలీస్ కార్యాలయ అధికారులు, సిబ్బంది పాల్గొని తమ సహచర అధికారికి శుభాకాంక్షలు తెలియజేశారు.

Tags:Grand Farewell for DCRB CI S. Lakshmana Murthy on His Promotion to DSP