అమరావతిముచ్చట్లు:
ఏపీ రాష్ట్ర రాజధాని అమరావతిలోని ఆహార భద్రత ప్రధాన కార్యాలయంలో విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన నలుగురు ఉద్యోగులపై ప్రభుత్వం వేటు వేసింది. సూపరింటెండెంట్ డి. శిరీష, సీనియర్ అసిస్టెంట్లు జి. అఖిల్, సంగీత రావు, జె. సుజాతలను ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జి. వీరపాండ్యన్ సస్పెండ్ చేశారు. అనధికారిక సెలవు, ఆర్థిక ప్రయోజనాల చెల్లింపులో జాప్యం, ఉన్నతాధికారుల ఆదేశాలను పాటించకపోవడం వంటి కారణాలతో ఈ చర్యలు తీసుకున్నారు. రాష్ట్ర మంత్రి సత్యకుమార్ కు అందిన ఫిర్యాదుల మేరకు విచారణ కమిటీ నివేదిక ఆధారంగా ఈ సస్పెన్షన్లు జరిగాయి.
Tags: Four Food Safety Employees Suspended in AP