May 2, 2026
Explore
చంద్రన్న మాట నిలబెట్టిన మంత్రి

చంద్రన్న మాట నిలబెట్టిన మంత్రి

May 2, 2026 | Andhra Pradesh

… టిఫిన్ సెంటర్ వాహనం అందజేత

రాయచోటి ముచ్చట్లు:

రాయచోటి నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని నిలబెట్టారు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హేమలత–ఈశ్వర్ దంపతులకు ఉపాధి కోసం ‘చంద్రన్న టిఫిన్ సెంటర్’ ఫోర్ వీలర్ వాహనాన్ని అందజేశారు. ఇటీవల ఎన్టీఆర్ ఇళ్ల ప్రారంభ సమయంలో ఇచ్చిన మాటను అమలు చేస్తూ ఈ సహాయం చేశారు. ఈ వాహనం ద్వారా కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకుంటుందని మంత్రి తెలిపారు. లబ్ధిదారులు ప్రభుత్వం, నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.

Tags: The Minister Who Kept Chandranna’s Word