ఇద్దరు మృతి, నలుగురికి తీవ్ర గాయాలు
తంబళ్లపల్లె ముచ్చట్లు:
తంబళ్లపల్లె మండలంలోని రెడ్డికోట సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కురబలకోట మండలం అంగళ్లు గొర్రెల సంత నుంచి గొర్రెలను కొనుగోలు చేసి కలకడ మండలం పాపిరెడ్డిగారిపల్లికి తరలిస్తున్న బొలెరో వాహనం బ్రిడ్జిపై నుంచి లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని 108 అంబులెన్స్ సిబ్బంది వెంటనే మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Tags:Horrific Accident at Reddikota