May 2, 2026
Explore
రాజంపేట పార్లమెంట్ లోకి అన్నమయ్య,మదనపల్లి జిల్లాలు

రాజంపేట పార్లమెంట్ లోకి అన్నమయ్య,మదనపల్లి జిల్లాలు

May 2, 2026 | Andhra Pradesh

కేంద్రం ఇచ్చిన 26 జిల్లాల గెజిట్ ప్రకారం అన్నమయ్య జిల్లా యధావిధిగా…

కూటమి ప్రభుత్వం ఇచ్చిన 29 జిల్లాల నోటిఫికేషన్ ప్రకారం కొత్తగా మదనపల్లి జిల్లా…

మహిళా బిల్లు వీగి పోవడంతో ఇప్పట్లో దేశ వ్యాప్తంగా శాసనసభ,లోక్ సభ స్థానాల పునర్విజన లేనట్లే…

తెలుగు రాష్ట్రాల పునర్విభజన చట్టం ప్రకారం 2009 లో రద్దయిన 50 పాత నియోజకవర్గాలు తిరిగి రానున్నాయా….

విభజన చట్టం అమలయితే అన్నమయ్య జిల్లాలో లక్కిరెడ్డిపల్లె,వాయల్పాడు నియోజకవర్గాలు తిరిగి రానున్నాయా…

పాత నియోజకవర్గాలు తిరిగి వస్తే రాజంపేట పార్లమెంట్ కు 8 నియోజకవర్గాలు,కడప పార్లమెంట్ కు 7 నియోజకవర్గాలు

వీరబల్లి,రామాపురం,లక్కిరెడ్డిపల్లి,గాలివీడు,చక్రాయపేట మండలాలతో లక్కిరెడ్డిపల్లి నియోజకవర్గం యధావిధిగా…

సుండుపల్లె,సంబేపల్లి,చిన్నమండెం,రాయచోటి,రాయచోటి రూరల్ మండలాలతో రాయచోటి నియోజవర్గం యధావిధిగా…

సుండుపల్లె మండలం రాయచోటిలో కలిస్తే టిడిపికి మరింత బలం పెరిగినట్లే…?

పాత నియోజకవర్గాలు యధావిధిగా వస్తే లక్కిరెడ్డిపల్లి,రాయచోటి,రాజంపేట,పీలేరు నియోజకవర్గాలతో అన్నమయ్య జిల్లా రాయచోటి కేంద్రంగా యధావిధిగా కొనసాగనుందా…!

కూటమి ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం కొత్తగా వచ్చే వాయల్పాడు నియోజకవర్గంతో పాటు తంబళ్లపల్లె,మదనపల్లి, పుంగనూరు నియోజవర్గాలతో కలిపి కొత్తగా మదనపల్లి జిల్లా ఏర్పాటు కానుందా…

ఇదేగనా జరిగితే అటు మదనపల్లెకు ఇటు రాయచోటికి సమన్యాయం జరిగినట్లేనని మేధావులు అంటున్నారు…

రాయచోటి ముచ్చట్లు:

తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు విడిపోయినప్పుడు తీసుకువచ్చిన విభజన చట్టం ప్రకారం 2009 కి ముందు రద్దయిన ఏపీలో 50 పాత నియోజకవర్గాలు తిరిగి రానున్నాయని ఊహాగానాలు సాగుతున్నాయి.ఇదే జరిగితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 175 నియోజకవర్గాలతో పాటు తిరిగి రానున్న 50 నియోజకవర్గాలతో కలిపి ఏపీలో 225 అసెంబ్లీ నియోజకవర్గాలు,25 పార్లమెంటు స్థానాలు యధావిధిగా కొనసాగనున్నాయి.తెలుగు రాష్ట్రాల విభజన చట్టం ప్రకారం పాత నియోజకవర్గాలు తిరిగి పునర్విభజన జరిగితే అన్నమయ్య జిల్లాలో లక్కిరెడ్డిపల్లి,వాయల్పాడు నియోజకవర్గాలు తిరిగి రానున్నాయి.ఇలా జరిగితే నూతనంగా వచ్చే లక్కిరెడ్డిపల్లి, రాజంపేట,రాయచోటి,పీలేరు నియోజవర్గాలతో రాయచోటి జిల్లా కేంద్రంగా అన్నమయ్య జిల్లా యధావిధిగా కొనసాగనుండగా,కొత్తగా ఏర్పాటు కానున్న వాయల్పాడు నియోజకవర్గంతో పాటు మదనపల్లి,తంబళ్లపల్లి,పుంగనూరు నియోజవర్గాలతో కూటమి ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం కొత్తగా రానున్న మదనపల్లె జిల్లాతో కలిపి 8 నియోజకవర్గాలతో అన్నమయ్య,మదనపల్లె జిల్లాలతో రాజంపేట పార్లమెంటు యధావిధిగా కొనసాగనుండగా 7 నియోజకవర్గాలతో కడప పార్లమెంట్ యధావిధిగా కొనసాగనుంది.2009 సంవత్సరంకు ముందు నియోజకవర్గాల రద్దుతో పాటు పునర్విజన కారణంగా అటు లక్కిరెడ్డిపల్లి ఇటు రాయచోటి నియోజకవర్గాలలో ఉన్న వీరబల్లి,సుండుపల్లి మండలాలు రాజంపేటకు వెళ్లడంతో 17 సంవత్సరాలుగా ఆ మండలాల ప్రజలు నియోజకవర్గ కేంద్రానికి వెళ్లేందుకు,రెవెన్యూ పనులపై ఆర్డిఓ కార్యాలయానికి వెళ్ళేందుకు నానా అవస్థలు పడుతున్నారు.తెలుగు రాష్ట్రాల విభజన చట్టం ప్రకారం పాత నియోజకవర్గాలు తిరిగి యధావిధిగా కొనసాగితే సుండుపల్లె,వీరబల్లి మండలాలు తిరిగి అటు లక్కిరెడ్డిపల్లెకు ఇటు రాయచోటి నియోజకవర్గాలకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.అలా జరిగితే ఒకప్పుడు రాయచోటి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి విజయాన్ని శాసించిన సుండుపల్లి మండలం రాయచోటి నియోజకవర్గంలో కలిస్తే తెలుగుదేశం పార్టీ మరింత బలే పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.దీనికి తోడు అక్కడ ఐదు మండలాలతో లక్కిరెడ్డిపల్లి,ఇక్కడ రాయచోటి మున్సిపాలిటీతో పాటు నాలుగు మండలాలతో రాయచోటి నియోజకవర్గం యధావిధిగా కొనసాగితే అభ్యర్థుల విజయాలు సులువుగా ఉంటాయని మేధావులు పేర్కొంటున్నారు.దీనికి తోడు రాజంపేట,రాయచోటి,పీలేరు,లక్కిరెడ్డిపల్లి నియోజవర్గాలతో కలిపి గతంలో లాగే రాయచోటి కేంద్రంగా అన్నమయ్య జిల్లాను యధావిధిగా కొనసాగించడమే కాకుండా కూటమి ప్రభుత్వం నూతనంగా ఇచ్చిన 29 కొత్త జిల్లాల ఏర్పాటు నోటిఫికేషన్ ప్రకారం పుంగనూరు,మదనపల్లి,తంబళ్లపల్లి,వాయల్పాడు నియోజకవర్గాలతో మదనపల్లె నూతన జిల్లాను ఏర్పాటు చేస్తే ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబుతో పాటు నారా లోకేష్ బాబు ఇచ్చిన హామీలు నెరవేరడమే కాకుండా 8 నియోజకవర్గాలతో అన్నమయ్య,మదనపల్లె రెండు జిల్లాలతో రాజంపేట పార్లమెంటు యధావిధిగా కొనసాగుతూ అన్ని ప్రాంతాల ప్రజలకు సమన్యాయం జరిగినట్లు ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.ఏదేమై నప్పటికీ కేంద్రంలో మహిళా బిల్లుతో పాటు డిలిమిటేషన్ బిల్లులు ప్రస్తుతానికి పక్కనపెట్టేయడంతో తెలుగు రాష్ట్రాల విభజన చట్ట ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో గతంలో రద్దయిన 50 నియోజకవర్గాలు తిరిగి పునర్విభజన కానున్నట్లు జోరుగా ప్రచారం సాగుతుండడంతో అటు వైసిపి పార్టీ నేతల్లో ఇటు కూటమి పార్టీల నేతల్లో కొత్త ఆశలు చిగురుస్తున్నాయని చెప్పడంలో సందేహం లేదు.

Tags: Annamayya and Madanapalle Districts Included in Rajampet Parliamentary Constituency