May 2, 2026
Explore
CC కెమెరాల సహాయంతో చైన్ స్నాచర్ గుర్తింపు

CC కెమెరాల సహాయంతో చైన్ స్నాచర్ గుర్తింపు

May 2, 2026 | Andhra Pradesh

కదిరి టౌన్‌ ముచ్చట్లు:

– అరెస్ట్ – రూ.2 లక్షల విలువైన బంగారు తాళిబొట్టు గొలుసు స్వాధీనం…

ముద్దాయి వివరాలు:
భూక్యా రమేశ్ నాయక్, వయస్సు: 42 సంవత్సరాలు, తండ్రి పేరు: లేట్ భూక్యా బొజ్జే నాయక్, వృత్తి: సీనియర్ అసిస్టెంట్, APSPDCL, కదిరి, కులము: ST (సుగాలి), నివాసం: మారుతి నగర్, కదిరి టౌన్, సత్యసాయి జిల్లా.

కేసు వివరాలు:
కదిరి టౌన్‌లోని మగ్గాల క్వార్టర్స్‌లో నివాసం ఉంటూ ఇళ్లలో పని చేసుకుంటూ జీవనం సాగించే పైపల్లి శాంతి (వయస్సు 35 సంవత్సరాలు), భర్త పేరు పైపల్లి రామమోహన్, తేదీ 28-04-2026 సాయంత్రం సుమారు 07:00 గంటల నుండి 07:30 గంటల మధ్య తన పని ముగించుకుని హిందూపూర్ రోడ్‌లోని సరస్వతి విద్యా మందిర్ ఎదుట నడుచుకుంటూ ఇంటికి వెళ్తుండగా, ఒక గుర్తుతెలియని వ్యక్తి స్కూటీపై వెనుక నుండి వచ్చి ఆమె మెడలో ఉన్న సుమారు రూ.2 లక్షల విలువైన (2 తులాలు) బంగారు తాళిబొట్టు గొలుసును లాక్కొని పారిపోయినట్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు, అదే రోజు కదిరి టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయబడింది.

దర్యాప్తు వివరాలు:
ఈ కేసు దర్యాప్తులో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా ఎస్‌పి గారి ఆదేశాల మేరకు, కదిరి డి‌ఎస్‌పి జే. శివ నారాయణ స్వామి మరియు కదిరి టౌన్ సి‌ఐ డి.వి. నారాయణ రెడ్డి, యస్ఐల పర్యవేక్షణలో నాలుగు ప్రత్యేక పోలీసు బృందాలు ఏర్పాటు చేసి కదిరి టౌన్‌లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల సహాయంతో చైన్ స్నాచర్ భూక్యా రమేశ్ నాయక్‌ను గుర్తించి, తేదీ 02-05-2026 ఉదయం కదిరి టౌన్‌, ప్ఱభుత్వ డిగ్రీ కాలేజీ గ్రౌండ్ వద్ద అరెస్ట్ చేయడం జరిగింది.
అతని వద్ద నుండి దొంగతనం చేసిన సుమారు రూ.2 లక్షల విలువైన (2 తులాలు) బంగారు తాళిబొట్టు గొలుసుతో పాటు, నేరానికి ఉపయోగించిన బ్లూ కలర్ స్కూటీని స్వాధీనం చేసుకోవడం జరిగింది.

విచారణలో వెల్లడైన విషయాలు:
ముద్దాయి కదిరి APSPDCLలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తూ, చెడు వ్యసనాలకు లోనై అధిక అప్పులు చేసుకున్నాడు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో చైన్ స్నాచింగ్‌కు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది.

అభినందనలు:
CC కెమెరాల సహాయముతో ఈ కేసును త్వరితగతిన ఛేదించి, ముద్దాయిని అరెస్ట్ చేసిన కదిరి టౌన్ పియస్ సి‌ఐ డి.వి. నారాయణ రెడ్డి తో పాటు ఎస్‌ఐ బాబ్జాన్, , స్పెషల్ టీం సిబ్బంది కానిస్టేబుల్ దేవా, హుస్సైన్, నాగరాజు, హరినాథ్ రెడ్డి, రామాంజి మరియు రవి కదిరి టౌన్ పియస్ కానిస్టేబుళ్లు శివ శంకర్ రెడ్డి, రమణ, రెడ్డప్ప తదితరులను ప్రత్యేకంగా అభినందించి, వారికి రివార్డులు అందజేయబడినవి.

గమనిక: కదిరి టౌన్ మరియు చుట్టుపక్కల మొత్తం కూడా CCTV కెమారాల నిఘాలో ఉన్న విషయము ప్రతి ఒక్కరూ గమనించాలి. ఎలాంటి నేరము జరిగినా తప్పు చేసినవారిని వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. ప్రజల అందరూ కూడా వారి ఇళ్ల వద్ద మరియు చుట్టూపక్కల CCTV కెమరాలను ఏర్పాటు చేసుకోవాలని కోరుతున్నాము.

Tags:Chain Snatcher Identified with the Help of CCTV Cameras