ఏమైంది ఈ బస్సులకు …ప్రయాణిస్తున్న ప్రయాణికులకి లేదు గ్యారెంటీ….ఇలా కాలం చెల్లిన బస్సులపై ప్రభుత్వం ఒక్కసారి కన్నెర్ర చేస్తే చాలు…ప్రయాణికుల లైఫ్& ఫ్యామిలీ సేఫ్ గా ఉంటాయి…ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధం.. తప్పిన ప్రాణాపాయం
ప్రకాశం ముచ్చట్లు:
వలేటివారిపాలెం మండలం చుండి సమీపంలో సోమవారం అర్ధరాత్రి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది.
కడప నుంచి విజయవాడకు వెళ్తున్న బస్సు ముందు టైర్ పగలడంతో మంటలు వ్యాపించాయి.
అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే బస్సును రోడ్డు పక్కన నిలిపి 33 మంది ప్రయాణికులను కిందికి దించారు.
వారంతా సురక్షితంగా దిగిన తర్వాత బస్సు పూర్తిగా కాలిపోయింది.
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు
Tags: Private travel bus gutted by fire